పదో తరగతి పరీక్షలు.. తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు !
పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం కూడా విచారణ జరిగింది. పరీక్షలు నిర్వహించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడివారు అక్కడే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతిస్తామని తెలిపింది. అంతేకాదు.. ఈసారి పరీక్షరాయలేని వారికి సప్లమెంటరీలో అవకాశం ఇస్తామని తెలిపింది. అయితే సప్లమెంటరీ పరీక్ష రాసేవారిని కూడా రెగ్యూలర్ విద్యార్థులుగా గుర్తిస్తారా ? అని కోర్టు ప్రశ్నించింది.
దీనిపై ప్రభుత్వంతో చర్చించి.. రేపు సమాధానం చెబుతామని విద్యాశాఖ తెలిపింది. దీంతో కోర్టు తీర్పు రేపటికి వాయిదా పడింది. మొత్తంగా పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎక్కడివారు అక్కడే పరీక్షలు రాసే వీలు కల్పించడం. రెండోది సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులని కూడా రెగ్యూలర్ విద్యార్థులుగా గుర్తించడం.