బెజవాడ గ్యాంగ్ వార్ : పోలీసుల ప్రెస్ మీట్ లో షాకింగ్ నిజాలు
బెజవాడ గ్యాంగ్ వార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ వార్ లో 13మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. ఈ గ్యాంగ్ వార్ వివరాలని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాకు వివరించారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని తెలిపారు.
పండు, సందీప్ గతంలో మంచి స్నేహితులు. ల్యాండ్ సెటిల్మెంట్లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి మధ్య అపార్ట్మెంట్ నిర్మాణంలో వివాదం తలెత్తింది. శ్రీధర్‌రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్‌రెడ్డి నాగబాబును ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్‌లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు. గ్యాంగ్ వార్ కి ముందు సందీప్, పండు ఒకరికొకరు ఒకట్రెండు సార్లు వార్నింగ్ ఇచ్చుకున్నారు. ఫైనల్ గా మాట్లాడుకుందామని వచ్చి.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పండు గ్యాంగ్ చేసిన దాడిలో సందీప్ మృతి చెందారి కమిషనర్ తిరుమరావు వివరించారు.
https://www.videogram.com/comic/428330a7-35f0-4b21-ab2b-9b9cc5a47d21