సినిమా.. సీన్ రివర్స్ !
ఇది వరకు శుక్రవారం వచ్చిందంటే పండగలా ఉండేది. థియేటర్స్ కళకళలాడేవి. అభిమాన హీరో సినిమా చూడబోతున్నామన్న ఆనందం అభిమాని మోహంలో కనిపించేది. ప్రీమియర్ షో టాక్, ట్విట్టర్ టాక్, లైవ్ అప్ డేట్స్ అంటూ సందడి ఉండేది. కరోనా సినిమా, సినీ ప్రేమికులని చావు దెబ్బ తీసింది. కరోనా పుణ్యమా అని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదివరకు థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత సినిమా డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కానుంది.
ఓటిటిలో విడుదలయిన సినిమాలు 50 రోజుల తర్వాత మళ్లీ థియేటర్ లో వేసుకుంటే బాగుంటుందన్నది నిర్మాతల ఆలోచనగా వుంది. దానికి అమెజాన్, సన్ నెక్ట్స్ లాంటివి ఒప్పుకోవాల్సి వుంది. మరోవైపు ఇటీవల జోరు చూపించిన అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గింది. ఇటీవల అమెజాన్ ప్రయిమ్ జ్యోతిక తమిళ సినిమా పొన్మగళ్ వందాళ్ ను ఏడు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. నేరుగా ఓటిటిలో విడుదల చేసింది. బ్యాడ్ లక్ ఏమిటంటే ఈసినిమా జనాలను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో ఇప్పుడు అమెజాన్ ప్రయిమ్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని విషయాలపై క్లారిటీ వచ్చాకే సినిమాల కొనుగోలు విషయంలో జోరు పెంచాలనే ఆలోచనలో ఉంది.