మహేష్ పర్యావరణ ట్విట్

#WorldEnvironmentDay సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ ట్విట్ చేశారు. ‘పర్యావరణాన్ని కాపాడటం అనేది సామూహిక, వ్యక్తిగత బాధ్యత’ అని దలై లామా కొటేషన్ ఒకటి షేర్ చేశారు. పర్యావరణాన్ని కాపాడాటానికి గల ఆవశ్యకతపై చిన్నిపాటి నోట్ ని షేర్ చేశారు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా కూడా #WorldEnvironmentDay పై ట్విట్ చేసింది. 

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ తెరకెక్కనుంది. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. బలమైన మెసేజ్ తో కూడిన ఫ్యామిలీ ఇంటర్ టైనర్ గా సర్కారు వారి పాట ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పారు. ప్రభుత్వం నుంచి షూటింగ్ లకి అనుమతి రాగానే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ, 14 రీల్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.