కరోనా ఎఫెక్ట్.. కొత్త పథకాల్లేవ్ !
కరోనా ఎఫెక్ట్ తో పలు కంపెనీలు కాస్ట్ కటింగ్ కు తెరలేపాయ్. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది. ఈ యేడాది కొత్త పథకాలను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అభియాన్’ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులైనా.. ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని సీతారామన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాలను మార్చి 31,2021 వరకు నిలిపివేస్తున్నట్లు మంత్రి వివరించారు.