‘నో పెళ్లి.. ‘ క‌వ‌ర్ వ‌ర్ష‌న్‌ అదిరింది !

వివాహంపై విరక్తి చూపిస్తున్నాడు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ‘నో పెళ్లి.. ‘ అంటూ బ్యాచిలర్స్ బాబులకి గ్యాంగ్ లీడర్ గా మారిపోయారు. తేజు నటిస్తున్న తాజా చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. నభా నటాషా హీరోయిన్. కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి దీని తల్లి ‘ వీడియో సాంగ్ ఇదివ‌ర‌కే రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. ఏకంగా 5 మిలియ‌న్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.

తాజాగా ‘నో పెళ్లి’ క‌వ‌ర్ వ‌ర్ష‌న్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో మ‌నీషా, శ్రావ‌ణ భార్గ‌వి, రోల్ రైడా, నోయ‌ల్‌, గీతా మాధురి, టిప్పు, శ్రీ కృష్ణ‌, ర‌మ్య స‌హా ప‌లువురు సింగ‌ర్లు ఉన్నారు. టాలీవుడ్ గాయ‌నీగాయ‌కులు అంద‌రూ ఒకే ద‌గ్గ‌ర క‌నిపించ‌డం ఆకట్టుకుంది. నో పెళ్లి కవర్ వర్షన్ ని మీరు చూసేయండీ.. !