తారక్.. సారీ చెబుతారా ? వార్నింగ్ ఇస్తారా ??


ఎన్టీఆర్ అభిమానులు, హీరోయిన్ మీరా చోప్రా ట్విటర్ వార్ జాతీయ సమస్యగా మారింది. తారక్ అభిమానులపై మీరా చోప్రా చేసిన ఫిర్యాదుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు. దర్యాప్తు చేపట్టారు. నిందితులని గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మీరా చోప్రా ఢిల్లీలో ఉంటున్న కారణంగా ఈ కేసుని.. అక్కడికి ట్రాన్స్ ఫర్ చేశారు.
 
మరోవైపు తారక్ అభిమానుల ఇష్యూ జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారింది. జాతీయ ఛానెల్స్ తారక్ ఫోటోలని ప్రచురిస్తూ.. కథనాలు ప్రచారం చేస్తున్నాయి. జాతీయ మహిళా కమీషన్ ఈ వ్యవహారంపై స్పందించింది. ఇంత జరుగుతున్నా.. ఇప్పటి వరకు తారక్ స్పందించకపోవడంపై విమర్శలు మొదలయ్యాయ్. ఈ నేపథ్యంలో తారక్ దిగిరాక తప్పేలా లేదు.

ఈ గొడవని ఇక్కడితో ఆపాలంటే ఎన్టీఆర్ నోరు విప్పాల్సిందే. క్షమాపణలు చెప్పడం లాంటి వ్యవహారాలు లేకపోయినా, కనీసం అభిమానులు, లేదా ఆయన పేరు చెప్పుకుంటూ గొడవ చేస్తున్న దురభిమానులకైనా ఓ వార్నింగ్ ఇవ్వాలి. లేకపోతే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ బాగా నెగెటివ్ గా పాపులర్ అయ్యే ప్రమాదముంది. మరీ.. తారక్ అభిమానుల తరుపున హీరోయిన్ మీరా చోప్రాకు సారీ చెబుతారా ? దాంతో పాటు అభిమానులకి వార్నింగ్ ఇస్తారా ?? అన్నది చూడాలి.