బాలయ్య ఇష్యూపై పోసాని షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో మెగా ‘వర్సెస్’ నందమూరి వార్ నడుస్తోంది. షూటింగ్ లకి అనుమతి కోసం సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో జరిగిపిన చర్చలపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమావేశాలకి తనని పిలవలేదన్నారు. మంత్రి తలసానితో కలిసి ఏమైనా హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారా ? అనే షాకింగ్ కామెంట్ కూడా చేశారు. బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య మీరు తోపు కాదు. కింగ్ కాదు. మీరు కూడా సగడు హీరోనే. ఇండస్ట్రీలో మీరు ఒక హీరో మాత్రమేనన్నారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోని పలువురు ఒక్కో వర్గానికి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు.

నిర్మాతలు సి. కల్యాణ్, భరద్వాజ, దర్శకుడు తేజ.. తదితరులు బాలయ్య ఇష్యూపై కామెంట్స్ చేశారు. తాజాగా నటుడు పోసాని మురళీ కృష్ణ బాలయ్య ఇష్యూపై స్పందించారు. ఓ యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య వర్సె మెగా వ్యవహరంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. బాలయ్య నటించిన పలు సినిమాలకు రచయతగా పనిచేశా. ఆయనతో కలిసి నటించా. ముఖానికి ముసుకేసుకోవడం బాలయ్యకు తెలీదు.  ఏది ఉన్నా ముఖం మీదే అనేస్తారు. మంచి ఉంటే మంచి.. చెడు ఉంటే చెడు. మేకప్ ఉంటే ఒకలా.. మేకప్ లేకపోతే మరోలా ఉండరన్నారు. అవినీతి అక్రమాలు అనేవి బాలయ్యలో లేవు.

చిరంజీవి కూడా మంచి మనిషే. ఆయన కూడా కష్టపడే పైకొచ్చారని పోసాని చెప్పుకొచ్చారు. మొత్తంగా.. ఇటు బాలయ్య, అటు చిరులపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా.. ఇద్దరు మంచోళ్లు అన్నట్టుగా పోసాని చెప్పుకొచ్చారు.