‘తలైవీ’ ఓటీటీ రేటు.. అదిరింది !

మరో సినిమా ఓటీటీ రిలీజ్ ఖాయమైంది. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ ప్రకటించుకున్న సినిమాలతో పోలిస్తే ఇది పెద్ద సినిమా. జ‌య‌ల‌లిత బయోపిక్ ‘త‌లైవీ’ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా కంగ‌నా ర‌నౌత్ ప్రకటించింది.

హిందీ, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న తలైవీ సినిమాను 55 కోట్ల‌కు అమ్మిన‌ట్టుగా కంగ‌నా చెప్పుకొచ్చింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ రెండింటికీ ప్ర‌సార హ‌క్కుల‌ను అమ్మార‌ట‌. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ? తలైవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం లేదు. థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అయినా రూ. 55కోట్లకి అమ్ముడుపోవడం గొప్ప విషయం.