మంచిని భయపెట్టారుగా !
మంచికి రోజుల్లేవ్. ఎవరైనా మంచి చేద్దాం. నలుగురిని ఆదుకొందాం అంటే ఓర్చే సమాజం కాదిది. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన బాలీవుడ్ నటుడు సోనూసూద్ గొప్ప మనసు చాటుకున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి తనవంతుకు కరోనా విరాళం అందించారు. అక్కడితో ఆగకుండా.. పేదకల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. వలస కూలీల కడుపునింపారు. సొంత ఖర్చులతో వారిని సొంతూళ్లకి పంపేంచే ఏర్పాట్లు చేశారు. రియల్ హీరో అనిపించుకున్నారు.
మంచి చేసిన సోనూసూద్ ని మనశ్యాంతిగా ఉంచిలేదు ఈ సమాజం. ఆయనకి రాజకీయాలతో లింకుపెట్టింది. సోనూసూద్ బీజేపీ మనిషి. ఆయన త్వరలోనేలో భాజాపా గూటికి చేరబోతున్నారని మహారాష్ట్ర అధికారిక పార్టీ ఆస్థాన పత్రిక సామ్నా కథనం ప్రచురించింది. శివసేన కీలక నేత కూడా మీడియా ముందు ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ ప్రచారం ఊపందుకోకముందే సోనూసూద్ జాగ్రత్తపడ్డారు. ఆయన నేరుగా వెళ్లి మహా సీఎం ఉద్దవ్ థాక్రే, ఆయన తనయుడుని కలిశారు.
తనకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సోనూసూద్. మొత్తానికి సోనూసూద్ లోని మంచిని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి పొలిటికల్ ఒత్తిళ్లు ఉంటాయని తెలిస్తే.. ఎవరుమంచి చేయడానికి ముందుకొస్తారు ? చెప్పండి. నిజంగానే సోనూసూద్ బీజేపీలో చేరుతాడు అనుకుందాం. అందులో తప్పేంటీ ? భాజాపాలో చేరాలనుకుంటే మంచి చేయొద్దా ? నలుగురి ఆకలి తీర్చవద్దా ?? అని సమాజాం ప్రశ్నిస్తోంది.. మరీ !