బాలయ్య అఘోరా లుక్.. చూశారా ?

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ఒకటి అఘోరా పాత్ర అని ఇప్పటికే దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చారు. దీంతో.. అఘోరా లుక్ లో బాలయ్య ఎలా ఉంటాడో ? చూడాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. పెద్దగా సస్పెన్స్ లేకుండానే బాలయ్య అఘోరా లుక్ బయటికొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఫ్యాన్ మేడ్ పిక్ కాదనిపిస్తోంది. బహుశా.. లుక్ టెస్ట్ కి సంబంధించిన పిక్ లా కనిపిస్తోంది. అయితే అఘోరాగా బాలయ్య ఫర్ ఫెక్ట్ సూటయ్యారు. ఆ పాత్రలో ఆయన విశ్వరూపం చూపించడం గ్యారెంటీ అని అభిమానులు చెప్పుకొంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన ఇద్దరు హీరోయిన్స్ జతకట్టనున్నారు. ఇద్దరు కూడా కొత్త హీరోయిన్స్ నే. ఇప్పటికే ఓ హీరోయిన్ ఖరారైందని బోయపాటి చెప్పారు. 

గతంలో బాలయ్య-బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్ సినిమాలొచ్చాయ్. ఈ రెండు బ్లాక్ బస్టర్ హిట్సే. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశాయ్. ఈ నేపథ్యంలో వీరి హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. బోయపాటి స్టయిల్ బాలయ్యకి సరిగ్గా సూటవుతుంది. భారీ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ తో అదరిపోయేలా ఉంటుంది. బాలయ్య హ్యాట్రిక్ సినిమా కూడా పక్కా కమర్షియల్ పంతాలో ఉండనుందని సమాచారమ్.