బాలయ్య బర్త్ డే విజ్ఝప్తి
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ బుధవారం 60వ పుట్టినరోజుని జరుపుకోనున్నారు. అయితే బర్త్ డే రోజున అభిమానులు తనని కలవడానికి రావొద్దని బాలయ్య విజ్ఝప్తి చేశారు. ఈ మేరకు బాలయ్య పేరుమీద ఓ ప్రెస్ నోట్ లాంటిది విడుదల చేశారు.
“ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానసోదరులందరికీ ఆత్మీయ విజ్ఞప్తి. నా 60వ పుట్టినరోజుని మీ ఇంటి పండుగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నా శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులైన మీ అందరితో వేడుకలు జరుపుకునేందుకు అవాంతరం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఇలాంటి సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ అందరి క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదమని బాలకృష్ణ పేర్కొన్నారు. మీరంతా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ నన్ను కలవడానికి రావొద్దు” అని లేఖలో బాలయ్య విజ్ఞప్తి చేశారు.
ఇక పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి రెండు బహుమతులు అందిస్తున్నారు బాలయ్య. స్వయంగా ఆయన పాడినపాటతో పాటు.. బోలయ్య సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఈ రెండు బహుమతులు అభిమానులకి అందనున్నాయి. ఈ రెండు బహుమతులని అభిమానులు ఆస్వాదించాలి. ఆశీర్వదించాలని బాలయ్య లెటెస్ట్ గా విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.