బాలయ్య మొదటి గర్జన.. అదిరిపోయింది !

నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటి గర్జన చేశారు. బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. #BB3 First Roar పేరిట వదిలిన టీజర్ అదిరిపోయింది. బాలయ్య మాస్ లుక్ లో కనిపించారు. అదిరిపోయే డైలాగ్ తో ఆకట్టుకున్నారు.

‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనేదానికి… శ్రీనుగారు మీ అమ్మ మొగుడు బాగున్నారా ? అనేదానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడకా” అంటూ బాలయ్య భారీ డైలాగ్ కొట్టారు. ఓ యాక్షన్ బిట్ సీన్ ని కూడా జతచేశారు. మొత్తానికి.. బాలయ్య మొదటి గర్జన అదిరిపోయింది. సినిమాపై అంచాలని రెట్టింపు చేసింది.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. తాజా టీజర్ లో చూపించిన పాత్ర ఒకటి కాగా, మరో పాత్రలో అఘోరా కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలకు బాలయ్యకి జంటగా కొత్త హీరోయిన్స్ జతకట్టనున్నారు. వారెవరు ? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.