బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్.. ఫస్ట్ లుక్ !

బాలయ్య-బోయపాటి కలిస్తే మాస్ కి పండగే. గతంలో రెండు సార్లు మాస్ కి విందు భోజనం పెట్టింది ఈ కాంబో. సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయ్. బాలయ్య సినిమా అంటే ఇలా ఉండలిరా.. అంటూ తొడలు కొట్టారు నందమూరి అభిమానులు. ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం (జూన్ 10) బాలయ్య బర్త్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఈరోజు రాత్రి 7:09నిమిషాలకే ఫస్ట్ లుక్ రానుంది.

ఈ సినిమా కోసం ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు.