శ్రియకి రాజమౌళి వార్నింగ్


సస్పెన్స్ ని మెయిన్ టైన్ చేయడంలో దర్శకధీరుడు రాజమౌళిని మించినోడు లేడు. బాహుబలి (2015)లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే సస్పెన్స్ ని బాహుబలి 2 (2017) వరకు దాదాపు  రెండేళ్లు కొనసాగేలా చేశాడు. ఆయన సినిమాలో నటించే నటీనటుల పాత్రల విషయంలోనూ సస్పెన్స్ ని కొనసాగిస్తుంటారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అదే పాటిస్తున్నారు.

కొమరమ్ భీమ్, అల్లూరి సీతారామరాజుల కథ ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా తారక్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్నారనే విషయాలు తప్ప.. మరేవి తెలియవు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర తాలుకు వివరాలేవీ తెలియవు. ఆయనకి జంటగా ఎవరు ? అనేది కూడా తెలీయదు. ఇప్పుడీ ఈ విషయాలన్నీ హీరోయిన్ శ్రియా  బయటపెట్టింది.

ఇటీవల హాలో యాప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై స్పందించింది శ్రియా. ఆర్ ఆర్ ఆర్ నటిస్తున్నానని తెలిపింది. అక్కడితో ఆగకుండా ఈ సినిమాలో అజయ్ దేవగణ్ కి జంటగా కనిపిస్తా. ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ లో నా ఏపీ సోడ్ ఉంటుందని తెలిపింది. ఇలా ఓ ఏపీసోడ్ ని లీక్ చేయడంపై శ్రియాపై రాజమౌళి సీరియస్ అయినట్టు సమాచారమ్. ఇకపై మీడియా ముందు సినిమా గురించి నోరు తెరవకూడదని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.