వైసీపీలో చేరనున్న శిద్దా రాఘవరావు
ప్రకాశం జిల్లాలో తెదేపా ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం జగన్ కి జై కొట్టిన సంగతి తెలిసిందే. తాను ఒక్కడినే కాదు. దాదాపు డజను తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారని బాంబు పేల్చారు. ఇప్పుడదే నిజం అవుతోంది. ప్రకాశంలో తెదేపా ఖాళీ కాబోతుంది. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్ధా రాఘవరావు, ఆయన తనయుడుతో కలిసి బుధవారం వైసీపీలో చేరతారని తెలుస్తోంది.
కరణం, శిద్ధాతో పాటుగా తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు కూడా వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీనియర్ నేతలే పార్టీపై నమ్మకాన్ని కోల్పోయి.. వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో యువనేతలు కూడా ఆలోచనలో పడ్డారు. వాళ్లు వైసీపీలో చేరేందుకు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.