బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్..ఇవే !

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 105 సినిమాలు పూర్తి చేశారు. ఇందులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయ్. ట్రెండ్ సినిమాలున్నాయ్. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలున్నాయ్. ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే విజయానికి పొంగకుండా, అపజయానికి కుంగకుండా.. సినిమాలు చేస్తూనే ఉన్నారు బాలయ్య.

ఈ వయసులోనూ ఆయన యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు. సవాల్ విరుస్తున్నారు. పైసా వసూల్ సినిమాలు చేస్తున్నారు. అయితే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టులుగా ఇంకో మూడు సినిమాలున్నాయట. అవే.. ఛంగీజ్ ఖాన్, గోనగన్నారెడ్డి, ఆదిత్య 999మ్యాక్స్. ఈ మూడు సినిమాలు కచ్చితంగా చేస్తా అంటున్నారు బాలయ్య.

బాలయ్య ఈరోజు 60వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య తన డ్రీమ్ సినిమాల గురించి చెప్పారు. ఇప్పుడు నా వయసు 60 యేళ్లు మాత్రమే. ఇంకో 60యేళ్లు ఉన్నాయని సరదాగా చెప్పుకొచ్చారు బాలయ్య. ఇక ఈరోజు పుట్టినరోజుని జరుపుకుంటున్న బాలయ్యకు సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్.