ధోనిపై ద్రవిడ్ ప్రశంసలు
టీమిండియా మాజీ కెప్టెన్ క్రీజులో ఉంటే మ్యాచ్ గెలిచినట్టే. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా విజయం కోసం ఆఖరి బంతివరకు పోరాడటం ధోని లక్షణం. ఆ లక్షణంపై ఇండియన్ వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు కురిపించారు.
‘నిజానికి అలాంటి నైపుణ్యం అందరికీ అవసరం. లేదా అందుకోసం సాధన చేయాలి. అలాంటి నైపుణ్యం నాకు లేదు. ఒక నిర్ణయానికి సంబంధించిన పరిణామాల గురించి నేను పట్టించుకుంటా. ఏమీ పట్టనట్టు ఆడే కళ సహజంగానే అబ్బిందా లేదా సాధన చేశాడా ? అన్నది ధోనీని అడిగి తెలుసుకోవాలి’ అని ద్రావిడ్ అన్నారు.