రానా పెళ్లి డేటు ఫిక్స్
రానా దగ్గుపాటి పెళ్లి డేటు ఫిక్సయింది. ఆగస్టు 8న రానా-మిహీకా బజాజ్’ల వివాహం జరగనుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం అధికారికంగా వెల్లడించారు. హైదరాబాద్‌లోనే ఈ శుభకార్యాన్ని జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.
పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా నిశ్చితార్థం నిర్వహించకుండా నేరుగా పెళ్లి చేయబోతున్నారు.