అభిమానులకి థ్యాంక్స్ చెప్పిన యువీ


గతేడాది ఇదే రోజు (జులై 10)న యువీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. నేటికి ఏడాది పూర్తవ్వడంతో అభిమానులు ‘మిస్‌ యూ యువీ’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెడుతున్నారు. అతడు సాధించిన ఘనతలను నెమరు వేసుకుంటున్నారు. యువీ ఫోటోలని పోస్ట్‌ చేస్తున్నారు. తనను గుర్తుచేసుకున్న అభిమానులకు అతడు కృతజ్ఞతలు ప్రకటించాడు.

‘ప్రియమైన అభిమానులకు, నేను పొంగిపోయాను. నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్‌ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కొవిడ్‌-19పై ప్రభుత్వం చెప్పే నియమాలు పాటించండి. అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి’ అని యువీ ట్వీట్‌ చేశాడు.