ఒక్కరోజే 357 కరోనా మరణాలు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఎంతలా అంటే.. ? ప్రతిరోజూ 10వేల కొత్త కరోనా కేసులు. వందల సంఖ్య కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 357మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా వైరస్ బయటపడిన అనంతరం 24గంటల్లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.
గడచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 9996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 2,86,579 మంది కరోనాబారిన పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా సోకి 8,102 మంది మృతి చెందారు. వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకోగా మరో 1,37,448 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఐదవస్థానంలో ఉంది. మరణాల జాబితాలో 11వ స్థానంలో ఉంది.