కోహ్లీని ఛాలెంజ్ చేసిన అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఛాలెంజ్ చేశారు. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గులాబో సితాబో’. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో పాత హవేలీ యజమాని మీర్జా షేక్‌గా అమితాబ్‌, ఆయన ఇంట్లో అద్దెకు ఉంటే వ్యక్తి బాంకీ సోధిగా ఆయుష్మాన్ కనిపించనున్నారు.

ఈ సినిమా జూన్‌ 12న నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్‌ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో ఓ పెద్ద హిందీ డైలాగ్‌ను తడబడకుండా ఐదుసార్లు చెప్పారు. ఈ ‘టంగ్‌ ట్విస్టర్‌’ను ఐదు సార్లు చెప్పాలంటూ విరాట్‌, దీపిక, రణ్‌బీర్‌, భూమి తదితరుల్ని నామినేట్‌ చేశారు. బిగ్ బీ ఛాలెంజ్ విసిరిన వారిలో ఆయుష్మాన్‌ మాత్రమే సవాల్  స్వీకరించి.. పూర్తి చేశారు. మిగితావారు బిగ్ బీ డైలాగ్ సవాల్ ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే అందరి దృష్టి కోహ్లీపైనే. ఆయన డైలాగ్ చెబుతారా ? చెబితే ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.