ప్రజలకి బాబు లేఖ
తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకి లేఖ రాశారు. ఇందులో సీఎం జగన్ యేడాది పాలనపై విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పాలన, రాక్షస పాలన నడుస్తుందని దుయ్యబట్టారు. కరోనా టైంలో ప్రభుత్వ చర్యలపై పెదవి విరిచారు. సంక్షేమ పథకాలని కట్ చేశారని, రైతులని నిర్లక్షం చేశారని, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో ఆందోళ వ్యక్తం చేశారు చంద్రబాబు.
అసలు ఉన్నట్టుండి ప్రజలకి లేఖ రాయాలని చంద్రబాబుకు ఎందుకు అనిపించింది ? ఎప్పటికప్పుడు మీడియా ముందుకొచ్చి.. సీఎం జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు కదా !. బాబు విమర్శణలని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది కదా !! అంటే వాటిని ప్రజలు రొటీన్ గా ఫీలవుతున్నారట. అందుకే ఈ సారి లేఖ రూపంలో సీఎం జగన్ పాలనని విమర్శించే ప్రయత్నం చేశారు బాబు. మరీ.. ఇదైనా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.