ఈఎస్‌ఐ స్కామ్’లో అచ్చెన్నాయుడు అరెస్ట్

అసెంబ్లీ సమావేశాలకి ముందు తెదేపాకు గట్టి షాక్ తలిగింది. మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉప నేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరావు అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. తేదేపా ప్రభుత్వం హయంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేశారు.
 
తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయితే ముందస్తు లీకు లేకుండా అచ్చెనాయుడుని అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది.