అచ్చెన్నాయుడు హెల్త్ బులిటెన్.. ఓ షాకింగ్ విషయం !
ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ వ్యవహారం శుక్రవార ఉదయం 7:10 నిమిషాల నుంచి అర్థరాత్రి వరకు నడించింది. ఆయనకి విజయవాడ ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ ని విధించింది. అయితే అచ్చెన్నాయుడుకి అనారోగ్యం దృష్ట్యా.. ఆయనకి చికిత్స అందించాలని కోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలో ఆయన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగింది. ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. అయితే, 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం లేదు. అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదు. నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుందన్నారు.