జగన్ ఫైనల్ టార్గెట్.. తండ్రికొడుకులే ?
ఏపీలో అరెస్టుల పర్వానికి తేరలేచింది. గత ప్రభుత్వంలో అన్నీ శాఖల్లో జరిగిన అవినీతి తోడే పనిని మొదలెట్టింది సీఎం జగన్ సర్కార్. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నకిలీ పత్రాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అంతేకాదు.. ఏపీలో మరిన్ని అరెస్టులు జరగనున్నాయి. ప్రతిరోజు ఒకరిద్దరు కీలక నేతలు అరెస్ట్ కానున్నారనే ప్రచారం జరుగుతోంది.
సీఎం జగన్ ఫైనల్ టార్గెట్ మాత్రం తండ్రికొడుకులే అనే ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ లని కూడా అరెస్ట్ చేయబోతున్నట్టు సమాచారమ్. గతంలో లోకేష్ పై అవినీతి ఆరోపణలొచ్చాయ్. సీఆర్డీఏ పరిధిలో లోకేష్ చేసిన అవినీతి రిపోర్ట్ సీఎం జగన్ దగ్గర ఉంది.
అతి త్వరలోనే లోకేష్ అరెస్ట్ ఉండొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్ టార్గెట్ పెద్ద చేప. చంద్రబాబుని అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్టయిన ఈఎస్ఐ స్కామ్ లోనే చంద్రబాబు పాత్ర ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి.. సీఎం జగన్ ఫైనల్ టార్గెట్ తండ్రీకొడుకులు అంటున్నారు. మరీ ఇద్దరి అరెస్ట్ చేస్తారా ? లేక ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేస్తారా ? అన్నది చూడాలి.