జగన్ ప్లాన్ అదిరింది


టైం చూసి కొట్టడం అంటే ఇదేనేమో ! 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఏకంగా 151 స్థానాలని గెలుచుకుంది. తెదేపా 23 స్థానాలకే పరిమితమైంది. ఆ సమయంలో సీఎం జగన్ ఊ.. అంటే తెదేపా దాదాపు ఖాళీ అయ్యేదే. కానీ జగన్ ఊ.. ఊ.. అన్నారు. అంతేకాదు.. పార్టీకిలోకి రావాలంటూ ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలనే కండిషన్ పెట్టారు. అయినా.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు.

జగన్ ఎలాంటి కండిషన్ పెట్టకుంటే మాత్రం తెదేపా ఇప్పటికే ఖాళీ అయ్యేది. జగన్ అప్పుడు చేసిన నిర్లక్ష్యం శాసన మండలిలో ఇబ్బంది కలిగింది. ఏకంగా శాసన మండిలి రద్దుకు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు సీఎం జగన్ కి మరో ఛాన్స్ వచ్చింది. తెదేపా అధ్యక్ష పీఠంపై నారా లోకేష్ ని కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయ్. లోకేశ్ కి అధ్యక్ష పదివి ఇవ్వడంపై పార్టీలోని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. వారిని వైసీపీలో చేర్చుకోవడంపై సీఎం జగన్ సక్సెస్ అయ్యారు.

కొందరు తనయుల భవిష్యత్ కోసం ఫ్యాన్ గాలికి కిందకి వెళ్లారు. వైసీపీ కి లొంగనివారు, చంద్రబాబు నమ్మినబంట్ల కోసం సీఎం జగన్ సర్కార్ అరెస్టుల స్కెచ్ వేసినట్టు సమాచారమ్. తెదేపా హయాంలో జరిగిన అవినీతిని తోడుతూ.. వారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది. ఇప్పటికే ప్లాన్ లో రెండు చేపలు పడ్డాయి. అచ్చెన్నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి అరెస్టయ్యారు. ఇంకా చాలామంది అరెస్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ ప్లాన్ అదిరిందని వైసీపీ అభిమానులు చెప్పుకొంటున్నారు.