ముద్దుతో కరోనా నయం
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారికి మందుని కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలున్నాయ్. మరోవైపు కరోనా నయం కావాలని మూఢనమ్మకాలతో ఏవేవో చేస్తున్నారు. చెట్లకి పూజలు చేస్తున్నారు. ఇటీవల ఓ తాంత్రికుడు నర బలి ఇచ్చాడు. కరోనా శాంతి పూజ పేరిట 400గొర్రెలని బలిచ్చిన ఘటనని కూడా చూశాం. మధ్య ప్రదేష్ ఓ భూత వైద్యుడు తన ముద్దుతో కరోనా నయం అవుతుందని నమ్మించడానికి ప్రయత్నించాడు. చివరికి ఆ ముద్దుతో బలయ్యాడు.
మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన ఓ వ్యక్తి భూతవైద్యంతో సమస్యలు పరిష్కారమవుతాయంటూ తన వద్దకు వచ్చే వారి చేతులను ముద్దు పెట్టుకునేవాడు. అంతేకాదు తన ముద్దు కరోనా రోగులపై పనిచేస్తుందని చెప్పి వారిని నమ్మించాడు. జూన్ 3న ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ మరుసటి రోజే అతను మరణించాడు. ఈ ఘటనతో ముద్దుతో, మూడ నమ్మకాలతో కరోనా నయం కాదని తేలిపోయింది.