ఎమ్మెల్యే ఇంట్లో నలుగురి కరోనా
జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో మరో ముగ్గిరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ముత్తిరెడ్డి భార్య, ఇంట్లో పని మనిషి, గన్ మెన్ లకి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన ముత్తంరెడ్డి అక్కడే చికిత్స పొందుతున్నారు.
మంత్రి హరీష్ రావు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సిద్దిపేటలో ఆయన పీఏకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గృహనిర్బంధంలోకి వెళ్లారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు రెండు సార్లు కరోనా నెగటివ్ వచ్చింది. అయితే మరో రెండు వారాల పాటు ఆయన గృహ నిర్భంధంలోనే ఉండనున్నారు. ఇప్పటికే కరోనా వారియర్స్ కరోనా బారినపడటం చూశాం. ఇప్పుడు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతుండటం ఆందోళనకి గురిచేస్తోంది.