హరీష్ రావులో కరోనా కలవరం

తెలంగాణ మంత్రి హరీష్ రావు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. సిద్దిపేటలో ఆయన నివాసంలోని వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌’గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి అప్రమత్త అయ్యారు. ఆయనతో పాటు ఎల్లవేళల ఆయనతో ఉండే 51 మందిని హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. వీరి బ్లెడ్ షాంపిల్స్ సేకరించి టెస్టులకి పంపించారు.

ఇపటికే 17 మంది రిపోర్ట్స్ వచ్చాయి. వీరికి కరోనా నెగటివ్ వచ్చింది. మిగితావారి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. మంత్రి హరీష్ రావు ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు సమాచారం. దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాష్ట్రంలో 164 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 133 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం కరోనాతో 9మంది మృతి చెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4484కి చేరాయి.