బ్రేకింగ్ : దివాకర్ ట్రావెల్స్ మరిన్ని కేసులు
నకీల పత్రాల కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లో వీరిని అరెస్ట్ చేసి.. అనంత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. 150 మంది వాహవానాలని అక్రమంగా కొనుగోలు చేశారరు. సుప్రీం కోర్టు నిబంధనలకి వ్యతిరేకంగా కొనుగోలు చేసి అమ్మారనే ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు.
లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? దివాకర్ ట్రావెల్స్ పై కేసులు పెట్టేందుకు ఇన్సురెన్స్ కంపెనీలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఓరియంటల్, యునైటెడ్ ఇన్సురెన్సెస్ కంపెనీలు కేసులు పెట్టబోతున్నట్టు తెలిసింది. దివాకర్ రెడ్డి ట్రావెల్స్ చేసిన ఘోరాలు అన్నీ ఇనీ కావన్ని చెబుతున్నారు. దాదాపు 90కిపైగా వాహనాలకి నకిలీ భీమా పత్రాలతో ఇన్సురెన్స్ పొందినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు.. లారీలని బస్సులుగా మార్చడం, నకిలీ ఎల్ వోసీలతో ఇతర రాష్ట్రాలకి బస్సులు నడపడం వంటి ఆరోపణలు దివాకర్ ట్రావెల్స్ పై ఉన్నాయి. మొత్తంగా దివాకర్ ట్రావెల్స్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.