నకిలీ పత్రాల స్కామ్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం అరెస్టులకి తెరలేపింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలని తోడుతోంది. ఈ క్రమంలో భారీ స్కామ్ లు వెలుగులోనికి వస్తున్నాయి. శుక్రవారం ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయనకి 14 రోజులు రిమాండ్ ని విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు.

ఇక ఈరోజు కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాల స్కామ్ లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ పత్రాలతో ప్రభాకర్‌రెడ్డి బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారని ఏపీ ఆర్టీఏ అధికారులు ఆరోపిస్తున్నారు. 154 లారీలకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీలో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెదేపా కీలక నేతలు ఊచలు లెక్కబెట్టక తప్పదనే ప్రచారం జరుగుతోంది.