ఇక సినిమాల్లో కౌగిలింతలు ఇలా.. !!

సినిమా షూటింగ్ లకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ధైర్యం చేసి షూటింగ్ ని ప్రారంభించడం లేదు. షూటింగ్ సమయంలో పాటించాల్సిన గైడ్ లైన్స్ ని తెలంగాణ ప్రభుత్వం కఠినంగా రూపొందించడమే ఇందుకు కారణమనే ప్రచారం ఉంది. ఇదిలావుంటే.. కరోనా లాక్ డౌన్ తర్వాత తొలి సినిమా షూటింగ్ మొదలైంది. దర్శకుడు రవిబాబు ‘క్రష్’ అనే సినిమా షూటింగ్ ని మొదలెట్టాడు. తొలిరోజే తనదైన స్టయిల్ లో సప్రైజ్ చేశాడు.

తొలిరోజు.. హీరో హీరోయిన్ కౌగిలించుకునే సన్నివేశాన్ని తెరకెక్కించామని చెప్పాడు. ఆ సీన్ షూటింగ్ కి సంబంధించిన బిట్ సీన్ షేర్ చేశాడు. హీరో ఈ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తాడు.. హీరోయిన్ ఆ పక్క నుంచి పరిగెత్తుకుని వస్తుంది. ఇద్దరు గట్టిగా హగ్ చేసుకుంటారు అంటూ రవిబాబు మధ్యలో గాజు గోడను పెట్టారు. రొమాంటిక్ సన్నివేశంలోనూ భౌతికదూరాన్ని పాటిస్తున్నామని ఆ సన్నివేశం ద్వారా ఆయన స్పష్టం చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత సినిమాల్లో కౌగిలింతలు ఇలాగే ఉంటాయని చూపించేశాడు రవిబాబు.