గ్రేట్ : కొడుకుపై కేసు పెట్టిన నటి

మలయాళీ నటి మాల పార్వతి కొడుకు అనంత్‌ కృష్ణన్ ట్రాన్స్‌జెండర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలొచ్చాయ్. ఈ ఆరోపణలపై మాల పార్వతీ బాధతాయుతంగా వ్యవహరించింది. ముందుగా మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్ కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పింది. అక్కడితో ఆగకుండా తనయుడిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. తనకి కొడుకు నిజంగానే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనన్నారు.  

‘మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌తో తనకి ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహం ఉందని నా కుమారుడు అనంత్‌ చెప్పాడు. సీమ అంగీకారం లేకుండా తనతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని అన్నాడు. అయితే ఈ విషయంలో నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాను. అలాగే అనంత్‌ సెల్‌ఫోన్‌ని పోలీసులకు అప్పగించాను. నేను సీమకే సపోర్ట్‌ చేస్తున్నా. అలా అని నా కుమారుడ్ని తప్పుగా చూడడం లేదు. ఒకవేళ నా కొడుకు తప్పుచేస్తే శిక్ష అనుభవించక తప్పదు’ అన్నారు మాల పార్వతి.