ఏపీలో మరిన్ని అరెస్టులు
వరుస అరెస్టులతో ఏపీ ఉడికిపోతుంది. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు శుక్రవారం అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయనకి 14రోజుల రిమాండ్ ని విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఇక ఈరోజు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్ది, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టయ్యారు. నకీలీ పత్రాల కేసులూ వీరిద్దరు అరెస్ట్ అయ్యారు.
వీరితోనే అరెస్టుల పర్వం ఆగేలాలేదు. ఏపీలో మరికొన్ని అరెస్టులు ఉంటాయి. తెదేపా ప్రముఖులు అరెస్ట్ కాబోతున్నారని సమాచారమ్. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తోడే పనిలో సీఎం జగన్ సర్కార్ ఉంది. ప్రతి శాఖలోనూ అవినీతి జరిగిందని భావిస్తున్నారు. దానిపై విచారణకి ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెదేపా హయాంలో మంత్రులుగా పని చేసిన వారిలో మెజారీటీ మంత్రులు అరెస్ట్ కానున్నారని తెలుస్తోంది. ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.