లోకేష్ నైట్ షో.. ఫెయిల్ !
ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత శుక్రవారం అరెస్టయిన సంగతి తెలిసిందే. 150కోట్ల అవినీతి జరిగింది. ఇందులో అప్పటి మంత్రి అచెన్నాయుడు పాత్ర ఉందని తేలింది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ అరెస్టు వ్యవహారం శుక్రవారం ఉదయం 7:10 నిమిషాల నుంచి అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా కొనసాగింది.
అయితే రాత్రి 10గంటల సమయంలో అచ్చెన్నాయుడుని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో.. అక్కడి తెదేపా యువనేత నారాలోకేష్, కొల్లు రవీంద్రతో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతలు వచ్చారు. అచ్చెన్నాయుడుని కలవాలని పోలీసులని కోరారు. అందుకు పోలీసులు ఓప్పుకోకపోవడం.. వాగ్వాదం జరిగింది. మేం గుంపుగా రాలేదు. నలుగురమే వచ్చాం. ముందస్తు సమాచారం ఇచ్చే వచ్చాం. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగులేదు. ఆయన్ని కలిసి వెళతామని లోకేష్ కోరారు. ఓ గంట సేపు అక్కడే వెయిట్ చేశారు. పోలీసులు ఎంతకి అనుమతి ఇవ్వకపోవడంతో.. నారాలోకేష్ నైట్ షో ఫెయిల్ అయినట్టయింది.