ఢిల్లీకి కేంద్రం కరోనా సాయం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం నాటికి దిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 39వేలకు చేరగా వీరిలో ఇప్పటివరకు 1271మంది మృత్యువాతపడ్డారు. కరోనా మృతుల సంఖ్యలో ఢిల్లీ.. ముంబైని మించిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్ బైజల్‌తో పాటు పలువురు అన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు.  

 కరోనా పోరులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. దిల్లీ ఆసుపత్రుల్లో ఏర్పడ్డ పడకల కొరత దృష్ట్యా తక్షణమే 500రైల్వే ఐసోలేషన్‌ బోగీలను కేటాయిస్తున్నట్లు అమిత్‌ షా వెల్లడించారు. తద్వారా కరోనా రోగులకు అందించే అన్ని వైద్య సదుపాయాలతో కూడిన 8వేల అదనపు పడకలు అందుబాటులోకి రానున్నాయని అమిత్‌ షా తెలిపారు. వీటితోపాటు అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తామని దిల్లీ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు