TSలో మరో ఎమ్మెల్యేకు కరోనా
తెలంగాణలో ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తంరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయనతో ఆయన ఫ్యామిలీలో మరో ముగ్గిరికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వాళ్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
తాజాగా నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. శనివారం బాజిరెడ్డితో పాటు ఆయన సతీమణికి కరోనా పరీక్షలు నిర్విహించగా ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అవగా.. భార్యకు నెగెటివ్ వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే దంపతులు హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబీకులు, అనుచరులను అధికారులు హోంక్వారంటైన్‌కు తరలించారు.
మరోవైపు మంత్రి హరీష్ రావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా కలవరంతో హోం క్వారంటైన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మేయర్ కు రెండో చేసిన పరీక్షల్లోనూ నెగటివ్ రాడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక హరీష్ రావు పీఏకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.