రైతులు, గ్రామీణులకి ప్రయోజనం కలిగేలా ఉపాధి హామీ పనులు

తెలంగాణలో ఉపాధి హామీ పథకంతో అనుసంధానించగలిగే పనులపై అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖ పనులు అనుసంధానించే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉపాధి హామీని వేగవంతం చేయడంతో పాటు కూలీలకు విధిగా పని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చిన్ననీటి వనరులు, చెక్‌డ్యాంల కింద పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రైతులు, గ్రామీణులకు ప్రయోజనం కలిగేలా వీలైనన్ని ఎక్కువ పనులను గుర్తించి చేపట్టాలని సీఎస్‌ తెలిపారు.