రీల్ ధోని మృతిపై టీమిండియా సంతాపం

రీల్ ధోని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త తాజా, మాజీ క్రికెటర్లకు షాక్ ని కలిగించింది. ఎంఎస్‌ ధోనీ బయోపిక్‌ చిత్రంలో నటించినప్పటి నుంచి సుశాంత్ టీమిండియా క్రికెటర్లకి దగ్గరయ్యారు. ఆయనతో క్రికెటర్లకి మధుర జ్జాపకాలున్నాయి. అంతేకాదు.. రీల్ ధోనిగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. సుశాంత్ మరణవార్తపై తాజా, మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేసారు.

సచిన్ :  ఈ వార్తతో షాక్‌ గురయ్యా. సుశాంత్‌ లేడని తెలిశాక ఎంతో బాధపడ్డా. అతడు ఎంతో ప్రతిభావంతమైన యువ నటుడు. అతడి కుటుంబానికి, సన్నిహితులకి సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆత్మకు శాంతి చేకూరాలి

కిరణ్‌ మోరె :  వ్యక్తిగతంగా ఇది నాకు దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన. ధోనీ క్యారెక్టర్‌ కోసం అతడికి బ్యాటింగ్‌ శిక్షణ ఇచ్చాను. ఈ షాక్‌ నుంచి ఎలా బయటపడలా తెలియట్లేదు. నా మిత్రుడు త్వరగా వెళ్లిపోయాడు. ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా

కోహ్లీ : సుశాంత్ మరణ వార్త షాక్‌కు గురిచేసింది. దీన్ని జీర్ణించుకోవడం ఎంతో కష్టం. అతడి ఆత్మకి శాంతి చేకూరాలి. అతడి బంధువులు, సన్నిహితులకి దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా

సురేష్ రైనా : మనం అందమైన నటుడ్ని కోల్పోయాం. మహీ బయోపిక్‌ కోసం మాతో ఎంతో సమయాన్ని గడిపాడు. సుశాంత్‌ మరణ వార్త షాక్‌కు గురిచేసింది

హర్భజన్‌ సింగ్ : దయచేసి ఇది అసత్యమని చెప్పండి. సుశాంత్ ఇక లేడనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. అతడి కుటుంబానికి నా సంతాపం

ఇర్పాన్ పటాన్ : సుశాంత్‌ మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. అతడి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇటీవల తాజ్‌ హోట్‌ల్‌ జిమ్‌లో అతడితో మాట్లాడాను. ‘కేదార్‌నాథ్‌’ చిత్రం కోసం అతడి పడ్డ కష్టాన్ని మెచ్చుకున్నాను. ‘భాయ్‌ చిచ్చోరె సినిమా కూడా చూడు. నువ్వు ఎంతో ఇష్టపడతావ్‌’ అని అతడు నాతో అన్నాడు

హార్థిక్ పాండ్యా : ఇది గుండె ముక్కలయ్యే వార్త. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి. అతడు సరదా మనషి. చాలా సార్లు కలిశాను. అతడి సన్నిహితులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా. నా హృదయం విలపిస్తోంది

వీరేంద్ర సెహ్వాగ్ : జీవితం చాలా సున్నితమైనది. ఇతరులు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. దయగా ఉండండి. ఓం శాంతి

రవిచంద్రన్‌ అశ్విన్‌ :  దేవుడా.. ఇది కఠినమైన వార్త