రేపు సీఎం’లతో ప్రధాని టెలికాన్ఫరెన్స్
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. రేపే సీఎంలతో ప్రధాని టెలికాన్ఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటి నుంచి మూడ్నాలుగు సార్లు ప్రధాని అన్నీ రాష్ట్రాల సీఎం లతో మాట్లాడారు. కరోనా కట్టడి, లాక్డౌన్ పొడగింపు విషయంలో రాష్ట్రాల సలహాలు, సూచనలు తీసుకున్నారు.
ఇప్పుడు మరోసారి ప్రధాని మోడీ సీఎంలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుండటంతో.. దేశంలో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మరోసారి లాక్డౌన్ అమలు చేయబోమని ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో.. ఆ దిశగా ప్రధాని నిర్ణయం తీసుకోకపోవచ్చని చెబుతున్నారు.
రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ప్రధాని ఆరా తీయబోతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ప్రతి ఒక్కరికి కరోనా టెస్టులు చేయడంపై సీఎంలతో ప్రధాని ముచ్చటించే ఛాన్స్ ఉంది. కేంద్రం కరోనా సాయంపై రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తితో ఉన్నాయి. వీటిపై సీఎంలు మరోసారి ప్రధానిని అడిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.