సుశాంత్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్.. షాకింగ్ నిజాల్లేవ్ !

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చేసింది. ఆదివారం ఉదయం జ్యూస్‌ తాగి బెడ్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్న సుశాంత్‌.. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు తలుపు పగలగొట్టి చూడగా, బెడ్‌షీట్‌ సాయంతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సుశాంత్‌ కనిపించాడు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు, 108కి కాల్‌ చేసి చెప్పారు. అప్పటికే సుశాంత్‌ మృతిచెందాడు.

అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడేం కాదు. ఆయనది ముమ్మాటికి హత్యేనని సుశాంత్ మామ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు ఏమైనా బయటకు వస్తాయా ? అనే అనుమానాలు కలిగాయ్. అయితే పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లోనూ ఆయన ఊపిరి ఆడకనే చనిపోయారు. ఆయనది ఆత్మహత్యేనని తేలినట్టు తెలుస్తోంది.

ముంబయిలోని కూపర్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఆయనకు శవపరీక్ష నిర్వహించారు. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక సుశాంత్‌ మృతి చెందారని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ‘వైద్యులు పోలీసులకు పోస్ట్‌మార్టం నివేదిక అప్పగించారు. ముగ్గురు వైద్యులు శవపరీక్ష చేశారు. ఉరి వేసుకోవడం వల్లే ఆయన మరణించారు’ అని డీసీపీ అభిషేక్‌ త్రిముఖ్‌ పేర్కొన్నారు. ఇక ఈరోజే సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.