ఏపీ బడ్జెట్ :‌ కేటాయింపులు ఇలా.. !

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండో సారి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.24లక్షల కోట్లతో బడ్జెట్ ని తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలని పెద్దపీఠ వేశామని, బడుగు, బలహీన వర్గాలని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ని రూపొందించినట్టు మంత్రి తెలిపారు.లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఏపీ బడ్జెట్-2020 కేటాయింపులు ఇలా.. 

* బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లు

* రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు

* మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

* వ్యవసాయానికి రూ.11,891 కోట్లు

* వైఎస్సార్‌ రైతు భరోసా రూ.3,615 కోట్లు

* ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు

* వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు

* బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు

* విద్యకు రూ.22,604 కోట్లు

* మైనార్టీల సక్షేమానికి రూ.1998 కోట్లు

* ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు

* ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు

* కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు

* వైద్య రంగానికి రూ.11,419 కోట్లు

* ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు

* వైఎస్‌ఆర్‌ గృహ వసతికి రూ.3వేల కోట్లు

* పీఎం ఆవాస్‌ యోజన(అర్బన్‌) రూ.2,540 కోట్లు

* పీఎం ఆవస్‌యోజన(గ్రామీణం) రూ.500 కోట్లు

* బలహీన వర్గాల గృహనిర్మాణానికి రూ.150 కోట్లు

* రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు

* డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు

* రూ.8వేల కోట్లతో 30లక్షల ఇళ్ల పట్టాలు

* అభివృద్ధి పథకాలకు రూ.84,140.97 కోట్లు

* షెడ్యూల్డుకులాల అభివృద్ధికి రూ.15,735.68 కోట్లు

* షెడ్యూల్డు తెగలకు రూ.5,177.53 కోట్లు

* బీసీల అభివృద్ధికి రూ.25,331.30 కోట్లు. బీసీ కులాలకు గతంలో పోలిస్తే 68.18శాతం అధికం

* మైనార్టీల అభివృద్ధికి 2050.22 కోట్లు. మైనార్టీలకు గతేడాదితో పోలిస్తే 116.10శాతం అధికం.

* జగనన్న చేదోడు పథకానికి 247 కోట్లు.