తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ?

తెలంగాణ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రిక్రియ పూర్తయింది. పరీక్షా ఫలితాలపై ఇంటర్‌ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మొదటి, రెండో సంవత్సర ఫలితాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి విద్యార్థుల్లో నెలకొంది. రేపు లేదా ఎల్లుండి ఇంటర్‌ ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది.

తెలంగాణలో కరోనా ప్రభావం అధికమవ్వక ముందే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయ్. ఆ తర్వాత జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలని ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకి గ్రేడ్ లని కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.