గుడ్ న్యూస్ : జులై 10 నుంచి థియేటర్స్ ఓపెన్

సినీ ప్రేమికులకి గుడ్ న్యూస్. జులై 10 నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయ్. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది ఇక్కడ కాదు. అమెరికాలో. లాస్‌ఏంజిల్స్‌, న్యూయార్క్‌ నగరాలలో జులై 10 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్ చేశారు.

భారత్ లోనూ లాక్‌డౌన్‌ సండలింపులు భారీ ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకి అనుమతులు ఇచ్చారు. అయితే థియేటర్స్ తెరవడానికి మాత్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. జులైలో పరిస్థితులని సమీక్షించి థియేటర్లకు అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు. యుఎస్ లో థియేటర్స్ ఓపెన్ అయితే..  మన దగ్గర సానుకూలా దృక్పథం ఏర్పడనుంది.

సినిమా షూటింగ్ లకి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ సమయంలో పాటించాల్సిన నిబంధనలని కఠినంగా పెట్టింది. రేపటి రోజున థియేటర్స్ కి అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం పెట్టే కండిషన్స్ కి థియేటర్స్ ని రన్ చేయడం.. సినిమాలు రిలీజ్ చేయడం కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.