అనుష్క ‘బుట్‌బుల్’ ట్రైలర్ చూశారా ?


బాలీవుడ్ హీరోయిన్ నిర్మాతగా వరుస వెబ్ సిరీస్ ని తీసుకొస్తున్నారు. ఇటీవలే ఆమె నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌లోక్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. అలరించింది. అనుష్క కొత్త ప్రాజెక్టు ‘బుల్‌బుల్‌’. అన్వితాదత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్‌ బోస్‌, తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, పరంబ్రాత ఛటోపాధ్యాయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

జూన్‌ 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న ఈ ప్రాజెక్టు ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను అనుష్క సోషల్‌మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘మన చిన్ననాటి రాత్రిపూట కథలు నిజమైతే ఎలా ఉంటుంది?’ అని పేర్కొన్నారు. ఇక ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. హారర్ సినిమాల ప్రేమికులకి బాగా నచ్చేలా ఉంది.