ఏపీలోనూ పది పరీక్షలు రద్దు ?

కరోనా ప్రభావంతో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయ్. ఏపీలోనూ పదో తరగతి పరీక్షలని రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం పది పరీక్షలని షెడ్యూల్ ప్రకారం యధాతథంగా నిర్వహిస్తామని చెబుతూ వస్తోంది.అయితే ఈరోజు సాయంత్రంలోగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సీబీఎస్ఈకి కేంద్రం కూడా గడువు ఇచ్చిందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల అన్నారు. అయితే రోజురోజూకి ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి. కరోనా విజృంభిస్తోంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లొ పూర్తి లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యంకాదు. ఏపీ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలని రద్దు చేయబోతుందని సమాచారమ్. దీనిపై ఈరోజు క్లారిటీ రానుంది.