మద్యం హోం డెలవరీ.. అమెజాన్ కి గ్రీన్ సిగ్నల్ !
మందు బాబులకి గుడ్ న్యూస్. ఇకపై మద్యం ఆన్ లైన్ లో దొరకనుంది. మన ఇంటికే పరుగెత్తుకుంటూ రానుంది. ఇటీవల కరోనా లాక్డౌన్ తో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. మందు దొరక్క మందుబాబులు పిచ్చొళ్లు అయ్యారు. అయితే మరోసారి లాక్డౌన్ విధించినా.. మందు బాబులకి ఇబ్బంది కలగకుండా ఆన్ లైన్ డెలవరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.
దేశంలోనే మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆన్ లైన్ బుకింగ్ ద్వారా మద్యాన్ని సరఫరా చేయనుంది అమెజాన్ సంస్థ. ఈ మేరకు స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ అమెజాన్ కు అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్రంలో అమెజాన్ తో పాటు అలీబాబా వెంచర్ బిగ్ బాస్కెట్ కూడా మద్యం పంపిణీ చేయడానికి అనుమతి తీసుకుంది. పశ్చిమ బెంగాల్ మాదిరిగానే మిగితా రాష్ట్రాల్లో ఆల్కాహాల్ డోర్ డెలవరి గురించి ఆలోచిస్తున్నాయ్. అన్నీ రాష్ట్రాలు ఆల్కాహాల్ డోర్ డెలవరికి అనుమతులు ఇస్తే.. మందు బాబుల కష్టాలు తీరినట్టే. కాకపోతే.. ఇంట్లో తాగి మందు బాబులు చేసే రచ్చతో గృహసింహ పెరుగుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.