సీపీఐ నారాయణ అరెస్ట్
‘చలో రాజ్‌భవన్’కు సీపీఐ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఈ కాల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వద్ద పోలీసులు మోహరించారు. రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డిని రాంనగర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మరోవైపు సీపీఐ నారాయణ పోలీసుల కళ్లు కప్పి రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. ఆయన ఎవరికీ కంటపడకుండా బైక్‌పై వచ్చి రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.