నిహారిక పెళ్లి సెట్ చేసింది ఎవరో తెలుసా ?

మెగా హీరోయిన్ నిహారిక పెళ్లికి రెడీ అయింది. కాబోయే వాడిని కూడా పరిచయం చేసింది. జొన్నలగడ్డ చైతన్యని నిహారిక పెళ్లాడనుంది. కాబోయేవాడితో దిగిన ఫోటోలని శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు జంట బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. నిహారిక-చైతన్య ప్రేమ పక్షుల్లా ఉన్నారు. ఫోటోలు చూస్తే.. వీరు ప్రేమ పక్షులు. వీరిది ప్రేమ వివాహం అనిపిస్తోంది. కానీ వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇంకా చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి కుదిర్చిన పెళ్లి. అవునూ.. గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ కొడుకే చైతన్య.

చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావుకి చైతన్య తల్లి పద్మ తండ్రి గుణ వెంకటరత్నం మంచి స్నేహితుడట. అప్పట్లో ప్రభాకర్ చెల్లెలుని నాగబాబు ఇచ్చిపెళ్లి చేయాలనే ప్రయత్నాలు చేశారట చిరంజీవి. కానీ అది జరగలేదు. అయితే ఇన్నాళ్లకి వీరి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే జొన్నలగడ్డ ప్రభాకర్ కొడుకు చైతన్యతో నిహారిక పెళ్లి చేయాలని చిరంజీవి నిర్ణయించారట. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పెళ్లి సెట్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ యేడాదియే నిహారిక-చైతన్యల పెళ్లి జరగనుందని సమాచారమ్.